పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​

మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్​ అయ్యారు.  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ఇద్దరు కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేష్

ఒక హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తులు కలిసి పోలీస్ స్టేషన్​లో  దావత్ చేసుకున్నారు. ఈ ఘటనతో  కానిస్టేబుల్ ళ్లను  సస్పెండ్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ పై శావా  పరమైన చర్యల  కోసం మల్టీజోన్ -1 ఐజీకి రిపోర్టు  పంపినట్లు  ఎస్పీ తెలిపారు.