నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు నేరగాళ్ల అరెస్టు

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు నేరగాళ్ల అరెస్టు

నిజామాబాద్, వెలుగు : గ్యాంగ్​గా ఏర్పడి దొంగతనాలు, హత్యలు ఇతర నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరగాళ్లను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. నాటు పిస్టల్​తో నాందేడ్​ నుంచి రైల్లో  నిజామాబాద్​ వచ్చిన  నోటెడ్​ క్రిమినల్​ను పట్టుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి గంటల వ్యవధిలో మరొకడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇన్​చార్జి​ సీపీ సింధూశర్మ తెలిపిన వివరాల ప్రకారం  1వ​టౌన్​ఎస్ఐ మొగులయ్య గురువారం రాత్రి నగరంలోని రైల్వే స్టేషన్​ దగ్గర వెహికల్స్​చెక్​ చేస్తున్నాడు.  

ఆ సమయంలో నాందేడ్​ ట్రైన్​దిగిన శ్రీహరి దేవీదాస్​శర్మ అలియాస్​హర్యా అనే యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంబడించి పట్టుకోగా అతడి వద్ద పిస్టల్, బుల్లెట్ దొరికాయి. విచారణ చేయగా నగరానికి చెందిన రౌడీ షీటర్​ ఆమెర్​అలీ ఖాన్​ అలియాస్​ బర్సాత్​ఆమెర్​తో కలిసి మొత్తం ఏడు నేరాలు చేసినట్లు తేలింది.  వీటిలో మూడు చైన్​ స్నాచింగ్​  కేసులు ఉన్నాయి. వెపన్​ఉంటే భయపెట్టి మరిన్ని నేరాలు చేయొచ్చనే ప్లాన్​తో నాందేడ్​ నుంచి రూ.30 వేలకు దేశీయ పిస్టల్​ కొని నిజామాబాద్​ చేరి పట్టుబడ్డాడు. 

పరారీలో ఉన్న రౌడీ షీటర్​అరెస్టు

ఏకే302 పేరుతో గ్యాంగ్​ నడిపి గతంలో పీడీ యాక్టుకింద జైలుకు వెళ్లిన రౌడీషీటర్​ ఆమెర్​అలీ ఖాన్​అలియాస్​  బర్సాత్​ ఆమెర్​ను శుక్రవారం సిటీలోని ఖిల్లా చౌరస్తాలో పట్టుకున్నారు. అతని వద్ద కత్తి, రెండు మొబైల్​ ఫోన్లు, పల్సర్​ బైక్​ను స్వాధీనం చేసుకున్నారు.  ఇతడిపై మర్డర్, హత్యాయత్నం, కిడ్నాప్​ కేసులు 12, ప్రాపర్టీ నేరాలు మూడు మొత్తం 15 కేసులు ఉన్నాయి.  2020 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. కొన్ని కేసులకు సంబంధించిన అతన్ని విచారించాల్సి ఉండగా పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

మడిగె ఇప్పిస్తానని..

నిజామాబాద్, వెలుగు : హైదరాబాద్​లో నిర్మిస్తున్న కమర్షియల్​ కాంప్లెక్స్​లో మడిగె ఇప్పిస్తానని రూ.25 లక్షలు తీసుకొని ఇందూర్​ సిటీకి చెందిన ఓ మహిళను అహ్మద్​ ఖాన్​ మోసం చేశాడు. బౌన్సర్లను వెంటబెట్టుకొని ఖరీదైన కార్లలో తిరిగుతూ రాయల్టీ మెయిటైన్​ చేసిన మోసగాడ్ని నమ్మి ఆమె మోసపోయింది. ఈ  సంగతి గ్రహించిన మహిళ నాలుగో టౌన్​లో ఫిర్యాదు చేయగా అహ్మద్​ఖాన్​ ను అరెస్ట్ చేశారు.