ఫిబ్రవరి 25 నుంచి బయో ఏషియా

ఫిబ్రవరి 25 నుంచి బయో ఏషియా

హైదరాబాద్, వెలుగు: ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ సమావేశం బయో ఏషియాను  ఈ నెల 25, 26 తేదీలలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ఎంపిక చేసిన సుమారు 80 స్టార్టప్లు పాల్గొంటాయి. హెల్త్​కేర్ రంగంలో ఇన్నోవేషన్లను నడిపించడానికి గ్లోబల్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బయోఏషియా ఏకతాటి పైకి తీసుకువస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

లైఫ్ సైన్సెస్ రంగంలో భారతదేశాన్ని తిరుగులేని నాయకుడిగా మార్చడానికి, నాయకులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రేరేపించనుందని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  క్వీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, జి 20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్రమంత్రి పీయుష్ గోయల్ సహా పలువురు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.