భద్రాచలంలో ఇన్విటేషన్ ఫుట్​బాల్ ​టోర్నీ షురూ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ప్రభుత్వ జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో శనివారం రెండు రోజుల ఇన్విటేషన్​ ఫుట్ బాల్​ టోర్నీ షురూ అయ్యింది. కాలేజీ ప్రిన్సిపాల్​ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కుంటతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్​లో పాల్గొంటున్నాయి. 

గతంలో ఈ టోర్నమెంట్​ జరిగినా అనివార్యకారణాల వల్ల కొంత కాలంగా నిర్వహించడం లేదు. పదేళ్ల తర్వాత కాలేజీ గ్రౌండ్లో ఫుట్ బాట్​ టోర్నమెంట్ క్రీడాభిమానులను సందడి చేస్తోంది.