సీపీఆర్‌‌ చేసినా.. దక్కని శిశువు ప్రాణం

  • రెండ్రోజుల వయసున్న బాబుకు బ్రీతింగ్‌‌ ప్రాబ్లమ్‌‌
  • సీపీఆర్‌‌‌‌ చేసి, హాస్పిటల్‌‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి

మెదక్, వెలుగు: రెండు రోజుల వయసున్న శిశువును కాపాడేందుకు 108 సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. సీపీఆర్‌‌ చేయగానే హార్ట్‌‌బీట్‌‌ మొదలైనా.. తర్వాత హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయాడు. మెదక్‌‌ పట్టణంలోని సుభాశ్‌‌ కాలనీకి చెందిన అమీనా బేగం శుక్రవారం స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు బ్రీతింగ్‌‌ ప్రాబ్లమ్‌‌ రావడంతో నీలోఫర్‌‌కు తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. 

దీంతో శనివారం శిశువును 108లో హైదరాబాద్‌‌కు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో నర్సాపూర్‌‌ వద్దకు రాగానే బాబుకు హార్ట్‌‌బీట్‌‌ ఆగిపోయింది. దీంతో 108 టెక్నీషియన్‌‌ రాజు వెంటనే బాబుకు సీపీఆర్‌‌ చేశాడు. కొద్దిసేపట్లోనే బాబుకు హార్ట్‌‌బీట్‌‌ మొదలైంది. తర్వాత నీలోఫర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించగా, అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చిన్నారి చనిపోయాడు.