రామప్ప, సమ్మక్క సారక్క జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తాం : ప్రొఫెసర్లు

రామప్ప, సమ్మక్క సారక్క జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తాం : ప్రొఫెసర్లు
  • వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్ల కామెంట్ 
  • వరంగల్ లో ముగిసిన జాతీయ సెమినార్ 

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: కాకతీయ కట్టడాలు చాలా అద్భుతమని, రామప్ప టెంపుల్ ప్రపంచంలోనే మరో వింతగా కనిపిస్తుందని పలువురు ప్రొఫెసర్లు కొనియాడారు.  కేయూలో నిర్వహించిన రెండు రోజుల సెమినార్ ముగిసింది.  వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు వర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సంకినేని వెంకట్ ఆధ్వర్యంలో రామప్ప టెంపుల్ ను ఆదివారం సందర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే పెద్ద ఆదివాసీ జాతరని పేర్కొన్నారు. రామప్ప, సమ్మక్క సారక్క జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పేందుకు పుస్తకాలను ముద్రిస్తామని తెలిపారు. 

కాకతీయుల పాలనలో గొలుసుకట్టు చెరువులు, దేవాలయాలు చరిత్రలో నిలిపోయానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయని, అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రాముఖ్య మైన ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని కోరారు. గోవా ప్రొఫెసర్ ప్రకాష్ దేశాయ్, తమిళనాడు ప్రొఫెసర్ లక్ష్మణన్, కేరళ ప్రొఫెసర్ జోష్ జార్జ్, ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి, ఓయూ ప్రొఫెసర్ శ్రీనివాసులు, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సత్యనారాయణ, రీసెర్చ్ స్కాలర్ శంకర్ పాల్గొన్నారు.