నవీపేట్, వెలుగు : డ్రంకెన్‌డ్రైవ్ కేసులో పట్టుపడిన వ్యక్తికి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీకాంత్ ఈనెల 5న పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్ లో పట్టుబడ్డాడు. మంగళవారం అతడిని కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నుర్జహాన్బేగం రెండురోజుల జైలు శిక్ష విధించారన్నారు.