
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు దాని చుట్టు పక్కల ప్రాంతాలు, తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని వాతావారణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ , సంగారెడ్డి , మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో పలు చోట్లు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది.
►ALSO READ | భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలి : ఎం. రాజేశ్వరి
ఇక రేపు (సోమవారం) కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగతో ఈదురు గాలులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.