సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు

సూర్యాపేట, వెలుగు : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు సెలవు ఉంటుందని, ధాన్యం కొనుగోళ్లు ఉండవని మార్కెట్ సెక్రటరీ బీవీ రాహుల్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. సెలవు దినాల్లో రైతులు మార్కెట్ కు ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు. శనివారం నుంచి యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.