GHMC అధికారులు ఈఏడాది ‘ఎర్లీబర్డ్’లక్ష్యం దిశగా సాగుతున్నారు. పన్ను చెల్లింపు దారుల నుంచి మంచి స్పందన వస్తోంది. అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లోరూ.500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకోగా ఆదివారం నాటికి దాదాపు రూ.375 కోట్లు వసూలయ్యాయి. ఎర్లీబర్డ్ కు ఇంక రెం డు రోజులుమాత్రమే ఉంది. చివరి 2 రోజుల్లో రూ.100 కోట్లకు పైగా వసూలవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రూ.437 కోట్లు రావటంతో ఈసారి మరో 63 కోట్ల రూపాయలు అధికంగా ఖజనాకు సమాకూర్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఎర్లీబర్డ్ ఆఫర్ లో భాగంగా పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ ఇస్తున్నారు. దీంతో ఆస్తి పన్ను చెల్లించేందుకు జనం క్యూకడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రూ.500 కోట్ల టార్గెట్ ను రీచ్ అవతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ధీమా వ్యక్తం చేశారు.
2012-13 లో ప్రారంభం….
ఎర్లీబర్డ్ కార్యక్రమానికి ఏటేటా పన్ను చెల్లింపుదారులను నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆస్తి పన్ను మొదటి నెలలోనే చెల్లిం చే వారికి 5 శాతం రాయితీ ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు 2012–-13 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రారంభించినప్పుడు నెల రోజుల్లో రూ.30 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఆ తర్వాత ఏటేటా మొదటి నెలలోనే పన్ను చెల్లించే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తోంది.2013–-14 లో వసూళ్లు ఏకంగా రూ.100కోట్లకు పెరిగాయి. దీంతోనే ఏటేటా జీహెచ్ఎంసీ అధికారులు ఎర్లీబర్డ్ పథకంలో పెద్ద ఎత్తున లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. గతేడాది దాదాపు 437 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దీంతో ఈ ఏడాదిఏకంగా రూ.500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్.
సెలవు దినాల్లోనూ బిల్లు కట్టేలా….
ఎర్లీబర్డ్ ఆఫర్ 30 రోజులు మాత్రమే ఉండటంతో బల్దియా అధికారులు సెలవు దినాల్లోనూ పన్ను చెల్లింపుదారులకు బిల్లు కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నారు. బల్దియా కార్యాలయాలతో పాటు మీ సేవా కేంద్రాలు, ఆన్ లైన్, జీహెచ్ఎంసీ సూచిం చినబ్యాంకు ఖాతాల్లో సెలవు దినాల్లోనూ పన్ను చెల్లించేందుకు ఏర్పా ట్లు చేశారు. దీంతో పన్ను చెల్లింపుదారులు వీలైన ఆప్షన్ ను ఎంచుకొంటూ ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ప్రతి సర్కిల్ లో బిల్ కలెక్టర్లు పన్నుచెల్లించే వారికి అందుబాటులో ఉండటంతో పాటు ఎర్లీబర్డ్ పథకాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్య పరిచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్, సిటిజన్ సర్వీస్ సెం టర్లు, మీ సేవా సెం టర్ల ద్వారా దాదాపు రూ.250 కోట్లకు పైగా పన్ను వసూలు కావటం విశేషం.