టిప్పర్​ బోల్తా పడి ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

టిప్పర్​ బోల్తా పడి ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

యాదాద్రి, వెలుగు: టిప్పర్​ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ఆలేరు మండలం శ్రీనివాసపురంలోని ఎస్ఎన్​ఇన్​ఫ్రా క్రషర్​మిల్లులో లోడింగ్​ కోసం మంగళవారం టిప్పర్ ​వెళ్తుండగా.. అదుపు తప్పి లోతైన గోతిలో పడిపోయింది. డ్రైవర్​ప్రహ్లాద్​సింగ్, క్లీనర్​ సందీప్​సింగ్ స్పాట్‎లో చనిపోయారు. మరో వ్యక్తి లవకుశ సింగ్‎కు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్‎కు తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆలేరు ఎస్ఐ రజనీకర్​ తెలిపారు.