పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో.. ఘోర ప్రమాదం.. కారు ఎలా అయిందో చూడండి..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో.. ఘోర ప్రమాదం.. కారు ఎలా అయిందో చూడండి..

పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారు. హైదరాబాద్ నుంచి రామగుండం వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిని రామగుండం ప్రాంతానికి చెందిన నిస్సార్ అహమ్మద్, మహమ్మద్ గౌస్గా పోలీసులు గుర్తించారు. మృత దేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

వర్షం పడుతుండటంతో లారీని రోడ్డు పక్కన ఆపి లారీ డ్రైవర్ లోపలే నిద్రిస్తున్నట్లు తెలిసింది. తెల్లవారుజాము సమయంలో ఉన్నట్టుండి ‘ధన్’మని సౌండ్ రావడంతో లారీ డ్రైవర్ ఏమైందోనని లారీ నుంచి కిందికి దిగి చూడగా కారు లారీని ఢీ కొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు లోపలే కారు నడుపుతున్న వ్యక్తి, అతని పక్కన కూర్చున్న మరో వ్యక్తి చిక్కుకుపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇద్దరూ చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన తర్వాత మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.