
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను కామినేని హాస్పిటల్ కి తరలించారు. మృతదేహాలని నల్లగొండ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు పోలీసులు. మృతులు హైదరాబాద్ లోని అల్వాల్ కి చెందిన కుంచేల సాయి గౌడ్(34), ప్రవీణ్ (32)గా గుర్తించారు.