నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ఇళ్లు కూలి తల్లికూతుళ్లు మృతి చెందారు. మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి నిద్రిస్తోన్న సమయంలో ఇళ్లు కూలడంతో తల్లికూతుర్లు నిద్రలోనే కన్నుమూశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. నిద్రలోనే తల్లికూతుళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Also Read :- మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా
మరో వైపు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. గత మూడు రోజులుగా నాన్ స్టాప్‌గా వర్షాలు పడుతుండటంతో జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కాలువలు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో బ్రిడ్జిల పై నుండి నీరు ప్రవహిస్తోన్నాయి. దీంతో పలు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోండటంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.