
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందారు. గ్రామానికి చెందిన హైమద్ (14) , షకీల్ (6) రాత్రి 8 గంటలకు హైవేపై ఉన్న మజీద్లో నమాజ్ చేసి తిరిగి ఇంటికి టూవీలర్ పై వెళ్తున్నారు. హైదరాబాద్ వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న టిప్పర్ అతివేగంతో వీరిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.