డెంగ్యూతో ఇద్దరు మృతి

డెంగ్యూతో ఇద్దరు మృతి

తొర్రూరు/సిద్దిపేట టౌన్, వెలుగు: డెంగ్యూతో వేర్వేరుచోట్ల ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీరప్ప నగర్ కు చెందిన బేతమల్ల -లక్ష్మీకాంత, రమేశ్ దంపతుల కుమారుడు బేతమల్ల ప్రేమ్ కుమార్(22) వరంగల్​ వాగ్దేవి కాలేజీలో బీటెక్​ ఫైనల్​ఇయర్​చదువుతున్నాడు. కాగా హైదరాబాద్​కు వ్యక్తిగత పనిపై వెళ్లిన ప్రేమ్ కుమార్​నాలుగు రోజుల కింద జ్వరంతో బాధపడుతూ ఇంటికి వచ్చాడు. తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్​ తీసుకోగా డెంగ్యూ అని నిర్ధారణ అయింది. జ్వరంతోపాటు పాటు ఫిట్స్ రావడంతో గురువారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్​అయ్యాడు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రేమ్​కుమార్​చనిపోయాడు. 

సిద్దిపేటలో.. 

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రజిని, రాజు దంపతులు కుమారుడు అయాన్ష్ (5)తో కలిసి సిద్దిపేటలోని మైత్రివనంలో నివసిస్తున్నారు. ఈనెల 19న అయాన్ష్ కు జ్వరం రావడంతో సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ చిల్డ్రన్​హాస్పిటల్ కు పేరెంట్స్​ తీసుకెళ్లారు.  జ్వరం తీవ్రం కావడంతో 22న అదే హాస్పిటల్ లో నిర్వహించిన పరీక్షల్లో డెంగ్యూ అని నిర్ధారణ కావడంతో అడ్మిట్​అయ్యారు. 23న ఓ ఇంజక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత బాలుడికి ఫిట్స్ వచ్చాయి. దాంతో అక్కడి నుంచి వెంటిలేషన్  సౌకర్యం కోసం పట్టణంలోని వేరే హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలించారు. చికిత్స పొందుతూ అయాన్ష్​చనిపోయాడు. 

హాస్పిటల్​ ఎదుట బాలుడి బంధువుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యంతోనే అయాన్ష్​మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ లో ఎలాంటి సౌకర్యాలు లేవని, వైద్యం అందించడంలోనూ డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ విషయమై హాస్పిటల్​డాక్టర్​ను వివరణ కోరగా బాలుడికి ఎప్పటికప్పుడు సరైన వైద్యం అందించినా పరిస్థితి విషమించి చనిపోయాడని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆయన స్పష్టం చేశారు.