కొన్ని అలవాట్లు ఎంత ప్రయత్నించినా మానలేరు చాలామంది. అందులో చీజ్ ఎక్కువగా వాడడం, టీ రోజూ తాగడం. నిజానికి ఈ రెండింటినీ రోజుకు ఎంత మోతాదులో తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించరు. అయితే వీటిని తీసుకునే వాళ్లకు ఒక గుడ్ న్యూస్. చీజ్ తినడం వల్ల డిమెన్షియా, రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చని వీటిపై చేసిన రెండు వేర్వేరు స్టడీల్లో తేలింది.
చీజ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. చీజ్‌ని పాల నుంచి తయారుచేస్తారన్న విషయం తెలిసిందే. ఆవు, మేక లేదా గొర్రెల పాల నుంచి రకరకాల ఫ్లేవర్స్, టెక్చర్స్లో తయారుచేస్తారు. చీజ్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అందులో క్యాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, బి12 వంటి నూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే చీజ్‌లో కొవ్వు, సోడియం కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని దీన్ని తగినంత మోతాదులో మాత్రమే తినాలి. మరీ ముఖ్యంగా బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఎలాగంటే అలా కాకుండా చీజ్ చూసుకుని తినాలి.
పాల ఉత్పత్తులతోపాటు మోడరేట్‌గా చీజ్ తీసుకోవడం వల్ల డిమెన్షియా లేదా కాగ్నిటివ్ డిక్లైన్ సమస్య వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. అందుకు పూర్తిగా కారణాలు తెలియలేదు. కానీ, చీజ్‌లో ఉండే బి12, డి విటమిన్‌లు కావచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా.
బ్లాక్ టీతో డయాబెటిస్‌కు..
రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుందని ఓ స్టడీలో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ యూనివర్సిటీ, చైనాలోని సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ కలిసి రీసెర్చ్ చేశాయి. రోజూ డార్క్ టీ తాగేవాళ్లలో 53 శాతం ప్రి–డయాబెటిస్ రిస్క్, 47 శాతం టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని తెలిసింది. అందులోనూ ఏజ్, జెండర్, బరువు, బీపీ, ప్లాస్మా గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే ఇది సాధ్యమైందని చెప్తున్నారు రీసెర్చర్స్.
‘‘టీ అలవాటు ఉన్నవాళ్లలో గ్లూకోజ్ ఎక్కువగా విడుదల కావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇది ప్రతిరోజూ డార్క్ టీ తాగేవాళ్లలో మాత్రమే” అని తెలిపారు అసోసియేట్ ప్రొఫెసర్ టాంగ్జీ వు.
667 సార్లు టాటూగా కూతురి పేరు
యూకెకి చెందిన మార్క్ ఒవెన్ ఇవాన్స్ అనే వ్యక్తి, తన కూతురి పేరును 667సార్లు టాటూ వేయించుకుని గిన్నిస్ రికార్డ్ కి ఎక్కాడు. మార్క్ వయసు 49, ఆయనకు తన ఏడేండ్ల కూతురంటే చాలా ఇష్టం. అది ఎంత ఇష్టం అంటే.. 2017లో లూసీ పేరును 267 సార్లు తన ఒంటి మీద టాటూగా వేయించుకునేంత. అయితే 2020లో అమెరికాకు చెందిన ఇరవై ఏడేండ్ల డైడ్రా విజిల్ అనే వ్యక్తి మార్క్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. విజిల్ తన పేరునే 300 సార్లు టాటూగా వేయించుకుని గిన్నిస్ బుక్ ఎక్కాడు. ఆ టైటిల్‌ని మళ్లీ తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు మార్క్. దాంతో మరో 400 సార్లు కూతురు లూసీ పేరును టాటూ వేయించుకున్నాడు. పేరు వేసేందుకు వీపు మీద ప్లేస్ సరిపోక తన రెండు కాళ్ల మీద 200 టాటూలు వేయించుకున్నాడు.
అది పూర్తవ్వడానికి ఐదున్నర గంటల సమయం పట్టింది. తన వీపు మీద ఉన్న పేర్లు బుక్‌లో పేజీలు తిరగేస్తే ఎలా కనిపిస్తాయో అలా డిజైన్ చేశారు ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్‌లు. ఈ డిజైన్ చేయడానికి ఒక గంట టైం పట్టిందట. అలాగే ఇద్దరు టాటూ ఆర్టిస్ట్‌లతో ఒకేసారి టాటూలు వేయించుకున్నాడు మార్క్. మొత్తానికి 667 టాటూలతో మరోసారి రికార్డ్ క్రియేట్ చేశాడు మార్క్. దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈ రికార్డ్‌ని నా కూతురికి అంకితమిస్తున్నా’ అన్నాడు. అలాగే మొదటిసారి తన కూతురు పుట్టినప్పుడు ఈ రికార్డ్ ట్రై చేశాడు మార్క్. దాంతోపాటు ఆ తర్వాతి నెలల్లో కూతురిని జాగ్రత్తగా చూసుకున్న హాస్పిటల్‌కు ఫండ్స్ రైజ్ చేసి మరీ ఇచ్చాడు మార్క్.