VijayDeverakonda: విజయ్ దేవరకొండ 'VD12' సెట్లో ఏనుగుల కొట్లాట.. గాయాలతో తప్పి పోయిన ఏనుగు!

VijayDeverakonda: విజయ్ దేవరకొండ 'VD12' సెట్లో ఏనుగుల కొట్లాట.. గాయాలతో తప్పి పోయిన ఏనుగు!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) కావడమే.ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి. ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్లో అనూహ్య పరిమాణం చోటు చేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని కొత్త మంగళం సమీపంలోని భూతత్తాన్ కెట్టులో VD12 మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఓ రెండు ఏనుగులు ఘర్షణ పడ్డాయని సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

ALSO READ | Harsha Sai: హర్షసాయికి పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఇక తప్పించుకోవడం కష్టమే..!

VD12 మూవీలో ఒక ప్రత్యేక సన్నివేశం కోసం పెంపుడు ఏనుగుతో పాటు మారో ఏనుగును తీసొకొచ్చారు. అక్కడ ఆ రెండు ఏనుగులు చిత్రీకరణ సమయంలో ఘర్షణ పడ్డాయి. దాంతో పుదుపల్లి సాధు అనే ఏనుగు గాయపడి భూతత్తాన్ కెట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడ కలకలం రేగింది.

గురువారం (అక్టోబర్ 3) సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఈ ఏనుగును పట్టుకునేందుకు అటవీ అధికారులు రాత్రి పది గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో.. తిరిగి శుక్రవారం ఉదయం 6:30 గంటలకు తిరిగి అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

కాగా తప్పి పోయిన ఏనుగుతో గొడవ పడిన మరో ఏనుగు కూడా అడవిలోకి పారిపోగా తిరిగి వచ్చింది. అయితే, ఈ ఏనుగుకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. సినిమా షూటింగ్ కోసం మూడు ఆడ ఏనుగులను, రెండు మగ ఏనుగులను VD 12 నేకర్స్ తీసుకువచ్చారని తెలుస్తోంది. 

VD 12ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ 2025 మార్చి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది.