బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) రొమాన్స్లో మాత్రమే కాదు, స్టైల్ లోను 'కింగ్'. తన ఐకానిక్ లుక్‌తో ఆడియన్స్ తో పాటు సినిమా సెలబ్రేటిస్ ను కూడా ఫిదా చేస్తుంటాడు. అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి, తాను ధరించే వాచీలు, షూస్ ఇలా ప్రతిదీ బ్రాండెడ్ మైంటైన్ చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే IIFA 2024 అవార్డ్స్ వేదికపైన షారుఖ్ ఖాన్ ఒకటి కాదు రెండు అత్యంత విలాసవంతమైన వాచీలు ధరించి కనిపించాడు. ప్రస్తుతం ఆ వాచీల ధర ఎంతనేది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఆ వాచీల ధర తెలుసుకున్నాక షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ALSO READ : రజనీకాంత్ Vs అమితాబ్ బచ్చన్.. న్యాయం చేయడంలో ఎవరి వెర్షన్ కరెక్ట్!
అబుదాబిలో జరిగిన IIFA 2024 అవార్డులలో, కింగ్ షారుక్ ఖాన్, హీరో విక్కీ కౌశల్‌తో కలిసి ఈవెంట్‌ను హోస్ట్ చేసారు. ఈ ఫస్ట్ డే ఈవెంట్ లో అతను ధరించిన వాచీలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండటంతో ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇందులో ఒక వాచీ 'Audemars Piguet Royal Oak Openworked Skeleton Ruby' ధరించారు. దీని విలువ దాదాపు రూ. 3.77 కోట్లు.
Adorable SRK Rani ♥️
— 👸Sharania Jhanvi𓀠 (@SharaniaJ) September 28, 2024
pic.twitter.com/qoJ3rJKxu7
కాగా రెండోరోజు ఈవెంట్ లో మరో 'పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్' వాచీ ధరించారు. ఈ విలాసవంతమైన టైమ్‌పీస్ మార్కెట్ ధర రూ. 4.77 కోట్లు ఉంది.
Shah Rukh Khan and Venkatesh Daggubati together!
— IIFA (@IIFA) September 28, 2024
Now that’s an overload of stardom in one frame!#IIFA2024 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaxIIFA #EaseMyTrip #Siggnature pic.twitter.com/L2dTGhdo3O
బాద్ షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కనిపించి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. 'పఠాన్', 'జవాన్' మరియు 'డుంకీ' సినిమాలు రికార్డ్స్ వేటలో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయి.
ప్రస్తుతం షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో 'కింగ్' అనే మూవీలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా 'జవాన్' సినిమాకుగానూ షారుక్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.