నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి మత్తులో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. సిటీ అవుట్ స్కట్ లోని రాఖిల్స్ కాలనీలో రెండు వర్గాలు విడిపోయిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కత్తులు, రాళ్లతో ఇరువర్గాలు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడికి కత్తితో పొడిచారు మరొ వర్గానికి చెందిన యువకులు. యువకుడు తీవ్రంగా గాయపడటంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా గంజాయి సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ALSO READ :- చిలకడదుంప వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..
గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి గొడవలు జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు.. అయినా పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నల్లగొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కొంతమంది యువకులను అరెస్ట చేశారు.