కరెంట్​షాక్​తో ఇద్దరు రైతుల మృతి

హుజూరాబాద్, జగిత్యాల టౌన్,  వెలుగు:  కరెంట్​షాక్​తో రెండు వేర్వేరు సంఘటనల్లో గురువారం ఇద్దరు చనిపోయారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన గడ్డం ఓదేలు(72)  పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటర్​ఆన్​చేస్తుండగా కరెంట్​షాక్​కొట్టడంతో చనిపోయాడు.  తండ్రి ఇంటికి రాకపోవడంతో  వెతుక్కుంటూ పొలం దగ్గరకు వెళ్లిన కొడుక్కు ఓదెలు చనిపోయి కనిపించాడు.  

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన కనక శ్రీనివాస్(19) తన పొలం వద్ద మోటరు వైరు రిపేరుకొస్తే దాన్ని సరిచేసేందుకు  విద్యుత్​శాఖకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌ఫార్మర్​ఆఫ్​చేశాడు.  తర్వాత ట్రాన్స్‌ఫార్మర్ ​ఆన్​చేస్తుండగా కరెంట్​షాక్​కొట్టి స్పాట్‌లోనే చనిపోయాడు.