- ప్రాజెక్టుకు భారీగా వాటర్ ఫ్లో
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ఫ్లో వస్తుంది. దీంతో సింగూర్ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో 28వేల181 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 15వేల114 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు ఉండగా.. ప్రసుత్తం ప్రాజెక్టులో 28.939 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూర్ రెండు గేట్లు ఓపెన్ చేయడంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగుతుంది. వనదుర్గ టెంఫుల్ ముందు నదీపాయ ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది.
మంజీరా నదిలోకి జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.