మెట్ పల్లి, వెలుగు: ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న రెండు బల్దియా వాహనాలను సీజ్ చేసినట్లు కోరుట్ల ఎంవీఐ రంజిత్ తెలిపారు. గురువారం మెట్ పల్లి పట్టణంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ మెట్ పల్లి బల్దియాకు చెందిన వాహనాలకు ఫిట్ నెస్ అయిపోయి చాలా నెలలు అవుతోందని పలుమార్లు నోటీసులు జారీ చేసినా అధికారులు స్పందించడం లేదన్నారు.
నెల రోజుల కిందటే చెత్త తరలించే వాహనానికి ఫిట్ నెస్ లేదని సీజ్ చేసినట్లు తెలిపారు. రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి వెంటనే వాహనాలకు సరైన డాక్యుమెంట్లు, ఫిట్నెస్ పొందాలని సూచించారు.