తుంగతుర్తిలో హిజ్రాల వీరంగం

తుంగతుర్తి, వెలుగు : రెండు హిజ్రా గ్రూపులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగింది. కొందరు హిజ్రాలు తుంగతుర్తిలో ఉంటూ షాపుల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా మరో హిజ్రా గ్రూప్‌‌ తుంగతుర్తికి వచ్చి డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరుగగా మాట మాట పెరిగి కొట్టుకున్నారు. ఓ గుంపుపై మరో గుంపు సభ్యులు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు పోలీస్‌‌స్టేషన్‌‌కు చేరుకున్నారు. పోలీసులు మందలించి, నచ్చజెప్పడంతో ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.