
ఐపీఎల్ సీజన్ 18 మొదలైంది.. క్రికెట్ సందడితో పాటు బెట్టింగ్ హడావిడి కూడా మొదలైంది. ఐపీఎల్ చుట్టూ లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతుంటే మరో పక్క అదే రేంజ్ లో బెట్టింగ్ కూడా నడుస్తుంది. బెట్టింగ్ ను అణిచివేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెట్టింగ్ రాయుళ్లు ఏమాత్రం తగ్గడంలేదు.
తాజాగా హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. బుధవారం ( మార్చి 26 ) ఇద్దరు బెట్టింగ్ బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిదగ్గర నుంచి రూ. లక్షా 36 వేలు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ కి చెందిన లదా, నారాయణగూడకు చెందిన అగర్వాల్ లు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు నిందితులు మెయిన్ బూకీ అయిన శిరాజ్ బూబ్ నుంచి ఐడీలు తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.