కొన్ని చిత్రాలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని హార్రర్ తో భయపట్టేస్తాయి. ఇదంతా ఇపుడు ఎందుకు అంటే..ఈ ఏప్రిల్ నెలలో రెండు హారర్ సినిమాలు థియేటర్స్లో రాబోతున్నాయి. అవేంటో ఓ సారి లుక్కేద్దాం.
లవ్ మీ
యంగ్ హీరో ఆశిష్ రెడ్డి (Ashish Reddy).ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ (Shirish) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు అరుణ్ భీమవరపుతో రీసెంట్ గా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు.లవ్ మీ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ డిఫరెంట్ గా ఉంది.
దెయ్యంతో రొమాన్స్ అంటూ హీరో చేసే కామెడీ, దెయ్యం తెచ్చే పాట్లు భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దెయ్యాన్ని ప్రేమించి, ఆమెతో రొమాన్స్ చేయాలనుకొనే ఒక యువకుడు కథే లవ్ మీ. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది.మరి దెయ్యంతో హీరో చేయబోయే రొమాన్స్ ఎలా ఉండనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న తొలి హర్రర్ సినిమా అనుకోవాలి.
కథ విషయానికి వస్తే..
ఒక దట్టమైన అడివి..దాని మధ్యలో ఒక పాడుబడ్డ బంగ్లా..అందులో ఒక అందమైన ఆడ దెయ్యం.ఇంతవరకు ఆ బంగ్లాకు వెళ్లిన వారెవ్వరు తిరిగి బయటకు వచ్చింది లేదనే విషయం తెలుసుకున్న ఆశిష్, వైష్ణవి.. ఆ బంగ్లా చూడటానికి వెళ్లారు.అక్కడ ఆశిష్ ఎలాగైనా ఆ దెయ్యంతో ప్రేమలో పడి రొమాన్స్ చేయాలనీ ప్రయత్నిస్తాడు.ఇక అతడికి పిచ్చి పట్టిందని ఫిక్స్ అయ్యి..వైష్ణవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.చివరికి ఆశిష్ కు దెయ్యం ప్రేమలో పడిందా? లేదా అనేది ఈ కథ అని తెలుస్తోంది.
గీతాంజలి మళ్ళీ వచ్చింది
సౌత్ బ్యూటీ అంజలి(Anjali)ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా..శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్ లో కనిపించారు. అయితే దాదాపు 10 సంవత్సరాల తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) సినిమా తెరకెక్కుతోంది.ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు.
కథ విషయానికి వస్తే..
మొదటి పార్ట్‌లో లాగానే ఈ సినిమాలో కూడా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా నటిస్తుండగా..హార్రర్ ఫిల్మ్ తీద్దామని అంజలి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబడిన భవంతిలోకి వెళతారు.అయితే ఆ భవంతీలో షూటింగ్ జరుగుతుండగా..వారికి దెయ్యాలు ఉన్నట్లు అనుకొని సంఘటనలు ఎదురవుతుంటాయి.ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్కడివి..వారికి ఏం జరిగింది.ఈ క్రమంలోనే అంజలి అండ్ టీమ్ ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.అంజలికి ఇది 50వ చిత్రం.
ఈ సినిమాను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. భాను భోగవరపు, నందు శవరిగణ మాటలు రాస్తున్నారు.ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.