పూజగదిలో దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధం

పూజగదిలో దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధం
  • కాలిబూడిదైన రూ. 2.50 లక్షల నగదు
  • 4.5 తులాల బంగారు నగలు

రాయికోడ్, వెలుగు : పూజగదిలో వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మాదాపూర్​గ్రామంలో జరిగింది. రెవెన్యూ, పోలీస్ అధికారుల కథనం ప్రకారం..  మాదాపూర్ కు చెందిన మంగలి విఠల్, అంజయ్య  ఇద్దరు అన్నదమ్ములు.  మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం ఉద‌‌‌‌యం విఠల్ భార్య రత్నమ్మ  ఇంట్లోని పూజ గదిలో  దీపం వెలిగించి బయ‌‌‌‌ట‌‌‌‌కు వ‌‌‌‌చ్చింది. ఆ దీపం దుస్తులకు అంటుకొని ఇంటి దులాల‌‌‌‌కు మంటలు అంటుకున్నాయి. 

కొంతసేపటికి ప‌‌‌‌క్కనే ఉన్న అంజ‌‌‌‌య్య ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో రెండు ఇండ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విఠల్ ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులతో పాటు  రూ 2.50 లక్షల నగదు, 4.5 తులాల నగలు, దస్తావేజులు అగ్నికి ఆహుత‌‌‌‌య్యాయి. మంగలి అంజయ్య ఇంట్లో ఉన్న  వివిధ వ‌‌‌‌స్తువుల కాలిపోవడంతో రూ. 50వేల నష్టం వాటిల్లింది.  

రెండు ఇండ్లలో కలిపి మొత్తం రూ. 5.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.  కాలిపోయిన ఇండ్లను  పోలీసులు, ఆర్ఐ  శ్రీకాంత్ సందర్శించి  జరిగిన నష్టాన్ని అంచ‌‌‌‌నా వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు  కృషి చేస్తానని తెలిపారు.