రెండు ఇండ్లలో 21 తులాల గోల్డ్​ చోరీ

రెండు ఇండ్లలో 21 తులాల గోల్డ్​ చోరీ
  •     రూ.2.50 లక్షల నగదు కూడా..

ఘట్​కేసర్, వెలుగు : ఘట్​కేసర్ పీఎస్ పరిధిలో పట్టపగలే రెండు ఇండ్లలో చోరీ జరిగింది. అవుషాపూర్​కు చెందిన కొట్టి రవీందర్ రెడ్డి కుటుంబంతో కలిసి సోమవారం స్థానికంగా జరిగిన తమ బంధువుల ఫంక్షన్​కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి.. బీరువాలోని 20 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

అలాగే అవుషాపూర్ న్యూనిటీ కాలనీకి చెందిన రమావత్ రమేశ్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. దీంతో దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని తులంన్నర బంగారం, 15 తులాల వెండి, రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ పరుశురాం తెలిపారు.