
లోకేశ్వరం, వెలుగు: లోకేశ్వరం మండలం వటాలి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో శివరాత్రి ఎగ్గం పెద్ద భూమన్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఎగ్గం నడిపి సాయన్న ఇంటికి కూడా మంటలంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేయగా అప్పటికే రెండు ఇండ్లు పూర్తిగా కాలిపోయింది. ఇండ్లలో ఉన్న డబ్బుతోపాటు, బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, టీవీ, ల్యాప్టాప్ దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఆస్తి నష్టం సుమారు రూ.32 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఆయన అంచనా వేశారు.