టూ ఇన్​ వన్​ సీలర్​

టూ ఇన్​ వన్​ సీలర్​

కొన్ని శ్నాక్​ ప్యాకెట్స్​ సీల్​ తీస్తే మొత్తం తినాల్సిందే. లేదంటే మెత్తబడిపోతుంటాయి. కానీ.. మళ్లీ సీల్ చేస్తే ఆ సమస్య ఉండదు. మరి సీల్​ చేయడం ఎలా? ఈ సీలర్​తో ఏ ప్యాకెట్​ అయినా ఈజీగా సీల్​ చేయొచ్చు. అంతేకాదు... మళ్లీ తినాలి అనిపించినప్పుడు దాంతోనే ప్యాకెట్​ని కత్తిరించొచ్చు. దీనికి హీట్ సీలింగ్, బ్లేడ్ కటింగ్ కోసం ప్రత్యేకంగా రెండు బటన్స్​ ఉంటాయి. స్టెయిన్‌‌‌‌లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్ ఉంటుంది. ఇది 400 mAh రీచార్జబుల్​ బ్యాటరీతో వస్తుంది. పదే పదే బ్యాటరీలను మార్చాల్సిన అవసరం లేదు. ఫుల్​ చార్జ్​ కావడానికి 2.5 గంటలు పడుతుంది. టైప్​ సీ కేబుల్​తో యూఎస్​బీ ద్వారా చార్జింగ్​ పెట్టుకోవచ్చు. చిప్స్, శ్నాక్స్, శాండ్‌‌‌‌విచ్‌‌‌‌ ప్యాక్​లు, క్యాండీ, పెట్ ఫుడ్ వాక్యూమ్ బ్యాగ్‌‌‌‌లను సీల్​ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 

ధర : రూ. 229