కామారెడ్డి జిల్లాలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్​

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్​

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను  శనివారం పోలీసులు అరెస్టు  చేశారు.  టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి,  సీసీఎస్​ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం..  మహారాష్ర్టలోని నాందేడ్​ జిల్లా నర్సి టౌన్​కు చెందిన షేక్​ ఇమ్రాన్ ఇస్మాయిల్​,   షేక్​ వాజిద్ సుమారు మూడు సంవత్సరాలుగా   కామారెడ్డి టౌన్​, దేవునిపల్లి  ఏరియాల్లో  30 నుంచి 40 ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు.

చోరీ చేసిన సొత్తును దెగ్లూర్​ ఏరియాలో అమ్ముతున్నారు.  మళ్లీ చోరీ చేసేందుకు శనివారం కామారెడ్డి టౌన్​కు  రాగా, వీరిని రైల్వే స్టేషన్​ ఏరియాలో పట్టుకున్నామని తెలిపారు.  కేసు దర్యాప్తులో కృషి చేసిన  ఎస్సై ఉస్మాన్​,   సిబ్బంది సురేందర్​, రవి, గణపతి,  శ్రవణ్​,  రాజేందర్​, కిషన్​,  టౌన్​, రూరల్ సీఐలు, ఎస్సైలు ఉన్నారు.