జపాన్ నావేలో పనిచేసే రెండు ట్రెనీ హెలికాప్టర్లు శనివారం రాత్రి ఒకదానికొకటి ఢీకొని పసిఫిక్ మహా సముద్రంలో కుప్పకూలిపోయాయి. వాటిలో ఉన్న 8మంది సిబ్బందిలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. SH-60 పెట్రోలింగ్ హెలికాప్టర్లు మధ్య జపాన్‌లోని దక్షిణ తీరంలో జలాంతర్గామి వ్యాయామాలు నిర్వహిస్తున్నారు. రిమోట్ ఇజు ద్వీప సమూహంలోని తోరిషిమాలో ఎక్సర్ సైజ్ చేస్తున్న జపాన్ నేవీకి చెందిన 2 హెలికాప్టర్లు కూలిపోయాయి. గల్లంతైయిన సిబ్బంది కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని జపాన్ లోని అమెరికా రాయబారి తెలిపారు.