బూబీట్రాప్స్‌‌లో పడి ఇద్దరు జవాన్లకు గాయాలు

బూబీట్రాప్స్‌‌లో పడి ఇద్దరు జవాన్లకు గాయాలు

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు ఏర్పాటు చేసిన స్పైక్‌‌ హోల్‌‌లో పడి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లాలో జరిగింది. ఏఎస్పీ చంద్రకాంత్‌‌ గవర్నా తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని గంగలూరు పోలీస్‌‌స్టేషన్‌‌  పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్టీఎఫ్, బస్తర్‌‌ ఫైటర్స్‌‌కు చెందిన జవాన్లు కూంబింగ్‌‌కు వెళ్లారు.

ఈ క్రమంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీట్రాప్స్‌‌ (స్పైక్​హోల్స్)లో ఎస్టీఎఫ్‌‌ కానిస్టేబుల్‌‌ శాంతకుమార్, బస్తర్‌‌ ఫైటర్స్‌‌కు చెందిన మహేశ్‌‌ పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని తోటి జవాన్లు గంగులూరు హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ఫస్ట్‌‌ ఎయిడ్‌‌ చేసిన అనంతరం రాయ్‌‌పూర్‌‌కు తరలించారు. మావోయిస్టుల కోసం సమీప అడవుల్లో అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు.