వాట్సాప్ గ్రూప్ వివాదం..ఇద్దరు కేరళ ఐఏఎస్ అధికారులు సస్పెండ్..కలెక్టర్బ్రో కూడా ఉన్నాడు

వాట్సాప్ గ్రూప్ వివాదం..ఇద్దరు కేరళ ఐఏఎస్ అధికారులు సస్పెండ్..కలెక్టర్బ్రో కూడా ఉన్నాడు

కేరళ ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్సెండ్ చేసింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె.గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్ లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రిలీజియన్ పరంగా ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసినందుకు గోపాలకృష్ణన్ ను సస్పెండ్ చేయగా..సోషల్ మీడియాలో సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ప్రశాంత్ పై చర్యలు తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇద్దరు ఐఏఎస్ లను సస్పెండ్ చేయాలని సీఎం పినరయి విజయన్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. 

మల్లు హిం దూ ఆఫీసర్స్  అనే మతపరమైన వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసినందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ గోపాలకృష్ణన్ ను సస్పెండ్ చేశారు. ఫేస్ బుక్ లో  అడిషనల్ చీఫ్ సెక్రట రీ జయతిలక్ పై విమర్శలు చేయడంతో వ్యవసాయాభివృద్ది , రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ప్రశాంత్ ను సస్పెండ్ చేశారు. 

ALSO READ | సమాజాన్ని విభజించేందుకు కుట్ర

అయితే మల్లు హిందూ ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు పై స్పందించిన గోపాలకృష్ణన్ .. తన ఫోన్ హ్యాక్ చేయబడిందని చెప్పారు. ఫోన్ రీసెట్ చేయడం వల్ల ఫోరెన్సిక్ పరీక్ష నిర్ధారించలేదు. గోపాలకృష్ణన్ ఫోన్ హ్యాక్ చేయబడిందా లేదా అనే ఇంకా స్పష్టంగా తెలియలేదని తిరువనంతపురం పోలీసులు చెబుతున్నారు. 

మరోవైపు జయతిలక్ తనపై నిరాధారమైన చేశారన్న ప్రశాంత్.. జయతిలక్ ను మానసిక రోగిగా అభివర్ణించిన చీఫ్ సెక్రటరీ తన రిపోర్టులో తెలిపారు. అయితే ప్రశాంత్ తన చర్యలను సమర్థించుకున్నాడు. తాను ప్రభుత్వ విధానాలను విమర్శించలేదని , వ్యక్తుల అనుచిత ధోరణి ని మాత్రమే విమర్శించానని అన్నారు. రాజ్యాంగం ప్రకారం తనకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని .. తనపై క్రమశిక్షణా చర్యలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ప్రశాంత్ CEOగా ఉన్న సమయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం చేపట్టిన 'ఉన్నతి' నుండి అనేక ఫైళ్లు కనిపించకుండా పోయాయని మీడియా కథనాలు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. గతంలో కోజికోడ్ జిల్లా కలెక్టర్‌గా, ఇతర ఉన్నత పదవుల్లో పనిచేసిన ప్రశాంత్ 'కలెక్టర్ బ్రో'గా బాగా పేరుంది. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి గతంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ప్రభుత్వ అధికారులు సర్వీసులో ఉన్నప్పుడు క్రమశిక్షణను పాటించాలని కేరళ రెవెన్యూ మంత్రి కె. రాజన్ స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.