- బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఇద్దరి మృతి
- మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన
దండేపల్లి, వెలుగు: న్యూ ఇయర్ వేడుకలు రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. బైక్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడిపోవడంతో ఇద్దరు చనిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన మంద రాజు(30), జిల్లపెల్లి పవన్ (18) న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు బైక్ పై మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో కడెం ప్రధాన కాల్వ అవతల అడవి వైపు వెళ్తుండగా.. దండేపల్లి కేజీబీవీ స్కూల్ సమీపంలోని బైక్ అదుపు తప్పింది.
దీంతో బ్రిడ్జికి ఢీకొని కాల్వలోకి పడిపోవడంతో ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.