ఉప్పలపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగళతండాకు చెందిన తేజావత్  సోమ్లా (57), బాగోతు దీపక్  కుమార్ (30) ఉప్పలపాడు గ్రామంలో గల చాముండేశ్వరి రైస్ మిల్ లో ధాన్యం విక్రయించారు.

రాత్రి తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్ పై బయలుదేరారు. ఉప్పలపాడు బ్రిడ్జి సమీపంలో హైవేపై వారి వాహనాన్ని అంబులెన్స్  ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. అంబులెన్స్ వెళ్లగానే  వెనుక నుంచి వచ్చిన డీసీఎం ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న సోమ్లా, దీపక్  కుమార్  తీవ్రంగా గాయపడి చనిపోయారు.