శ్రీకాకుళం: తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేటలో శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం గ్రామస్థులపై ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.