వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య

రఘునాథపల్లి, వెలుగు: ఉరి వేసుకొని ఓ ఆటో డ్రైవర్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రఘునాథపల్లికి చెందిన కడారి నర్సింహులు (30) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం కూడా ఆటో తీసుకొని అడ్డా మీదికి వెళ్లాడు. సాయంత్రం నిడిగొండ రైల్వే బ్రిడ్జి సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే నర్సింహులు ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

విషం తాగి యువకుడు...

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్‌‌‌‌లో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... రామకృష్ణాపూర్‌‌‌‌ (టి ) గ్రామానికి చెందిన బొంపెల్లి శివకృష్ణ (26) హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున విషం తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తీసుకెళ్తుండగా చనిపోయాడు.