భువనగిరిలో 2 లీటర్ల హాష్​ ఆయిల్​ పట్టివేత

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో రెండు లీటర్ల హాష్​ ఆయిల్ పట్టుబడింది. తన ఆఫీస్​లో కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్​​జోషి వెల్లడించారు. హైదరాబాద్​లోని బోరబండకు చెందిన పెరుసాముల దినేశ్, అమర్థలూరి హానెస్ట్​మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే వీరికి తాళ్లపల్లి భరణి పరిచమయ్యాడు. సులభంగా డబ్బులు సంపాదించడానికి హాష్ ఆయిల్ అమ్మడమే బిజినెస్​గా చేసుకున్నారు.

ఇందులో భాగంగా ఏపీలోని నర్సీపట్నానికి వెళ్లి రూ.50 వేలకు లీటర్​చొప్పున రెండు లీటర్ల హాష్​ ఆయిల్​ కొనుగోలు చేశారు. తిరిగి హైదరాబాద్​కు వెళ్తుండగా, వీరి కారును భువనగిరి శివారులోని అనాజీపురం క్రాస్​రోడ్డు వద్ద ఆపి  ఎస్ వోటీ, భువనగిరి రూరల్​ పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రెండు లీటర్ల హాష్​ ఆయిల్​పట్టుకొని, నిందితులను రిమాండ్​కు తరలించినట్లు సీపీ తెలిపారు.