భీమదేవరపల్లి, వెలుగు : భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని హైవేపై మంగళవారం రెండు లారీలు దిగబడిపోయాయి. ప్రస్తుతం సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు నేషనల్హైవే నిర్మాణం జరుగుతోంది. కల్వర్టులు నిర్మించిన చోట కేవలం కంకరతో నింపుతుండడంతో తరచూ వెహికల్స్దిగబడుతున్నాయి.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ఇలాగే రెండు లారీలు ఇరుక్కుపోయాయి. ట్రాఫిక్స్తంభించింది. దీంతో హనుమకొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వెహికల్స్ గోపాల్పూర్ వైపు మళ్లించారు.