కీవ్పై రష్యా బలగాల బాంబుల వర్షం

ఉక్రెయిన్ పై రష్యా దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంపై రష్యా బలగాలు మెరుపుదాడులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్ లో ఉదయం రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. క్యాపిటల్ సిటీని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సైన్యం.. మిలటరీ శిబిరాలు, ఎయిర్ బేస్ లను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. దీంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బాంబు దాడిలో కీవ్ నగరంలో రెండు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో ఇప్పటి వరకు 83 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 13 నగరాలపై దాడులకు దిగిన రష్యా 203 దాడులు చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై లారీ బోల్తా

ఇండోనేషియాలో భారీ భూకంపం