ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్​

జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని కాశింపల్లిలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరునెలల నుంచి మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘావర్గాలు అనుమానించాయి.

ఇవాళ ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ ఇంటిని చుట్టిముట్టాయి. వారి వద్ద ఆత్మరక్షణ కోసం ఉంచుకున్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు మావోయిస్టులు వయస్సు మళ్లిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య చికిత్స కోసం వచ్చినట్లు సమాచారం.