చత్తీస్​గఢ్–​-ఒడిశా బార్డర్​లో ఎన్​కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

చత్తీస్​గఢ్–​-ఒడిశా బార్డర్​లో ఎన్​కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

భద్రాచలం, వెలుగు: చత్తీస్ గఢ్– ఒడిశా బార్డర్ లో సోమవారం ఎన్ కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. చత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో చత్తీస్ గఢ్ కోబ్రా బలగాలు, ఒడిశా ఎస్​వోజీ జవాన్లు జాయింట్ గా కూంబింగ్ ​నిర్వహించారు.

ఈ క్రమంలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరో కోబ్రా జవాన్ కు గాయాలయ్యాయి. స్పాట్ లో రెండు మృతదేహాలతో పాటు, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.