తాగారు.. కొట్టుకున్నారు.. చంపాడు.. లొంగిపోయాడు..

తాగారు.. కొట్టుకున్నారు.. చంపాడు.. లొంగిపోయాడు..

కరీంనగర్​లో దారుణ ఘటన జరిగింది.  అశోక్​ నగర్​ ప్రభుత్వ పాఠశాల భవనంపై  ఓ ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం తాగారు.  బాగా కిక్​ వచ్చిందేమో తెలియదు కాని.. మద్యం మత్తులో  ముజ్జు, సోఫియాన్  అనే వ్యక్తులు మధ్య గొడవ జరిగింది. వాదనతో మొదలైన వీరి ఘర్షణ  తీవ్రరూపం దాల్చింది. దీంతో వక్తిగత కక్షలతో మాటామాటా పెరిగి ముజ్జు అనే వ్యక్తిపై సోఫియాన్​ కత్తితో దాడి చేశాడు.  దీంతో మజ్జు అక్కడికక్కడే మృతి చెందాడు.

మద్యం మత్తులో మజ్జు అనే వ్యక్తిని హతమార్చిన సోఫియాన్​.. స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు.  తరువాత  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​ మార్టం కోసంపరిక్షలకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న వన్​ టౌన్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.