నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ రైస్ మిల్ ధాన్యం స్టోరేజ్ గోదాంలో ప్రమాదవశాత్తు గోడ కూలి ఇద్దరు వలస కూలీలు చనిపోయారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన గంగ ప్రసాద్(45), రఘువీర్(30)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులు భరణి రైస్ మిల్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. వారు పనిలో ఉండగా అకస్మాత్తుగా రైస్ మిల్ గోదాం గోడ కూలి వారిపై పడింది. దీంతో వారు అక్కడికక్కడే చినపోయినట్లు మిర్యాలగూడ పట్టణ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.