
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ లో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు వలస కార్మికులు బావిలో పడిపోయి చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతి చెందిన ఇద్దరు యూపీ, ఒడిశాకు చెందిన బైద్యనాథ్ భట్ (25), హరిసింగ్ మజ్ హీ(30)గా గుర్తించారు.
పైడిగుమ్మల్ లో వెంచర్ పనులకు వచ్చి మార్చి 10న ఇద్దరు కార్మికులు అదృశ్యమైనట్లు చెప్పారు. మార్చి 13న కోహీర్ పోలీస్ స్టేషన్ లో అదృశ్యంపై ఫిర్యాదు వచ్చినట్టు చెప్పారు. పైడిగుమ్మల్ గ్రామానికి వచ్చి తిరిగి పని ప్రదేశానికి వెళ్తూ దారితప్పి బావిలో పడిపోయినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. మార్చి 27న రాత్రి వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు పోలీసులు. మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కోహీర్ పోలీసులు.