తుర్కియేలో మిలిటరీ హెలికాప్టర్లు ఢీ.. ఆరుగురు మృతి

తుర్కియేలో మిలిటరీ హెలికాప్టర్లు ఢీ.. ఆరుగురు మృతి

అంకారా: తుర్కియే మిలిటరీ హెలికాప్టర్లు రెండు ఆకాశంలో ఢీకొన్నాయి. ఇస్పార్టా ప్రావిన్స్​లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఆరుగురు మిలిటరీ సిబ్బంది మరణించారు. ఐదుగురు స్పాట్​లోనే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో మిలిటరీ ఏవియేషన్ స్కూల్​కు ఇన్​చార్జ్​గా ఉన్న బ్రిగేడియర్ జనరల్ కూడా ఉన్నారు. ప్రమాదానికి కారణం తెలియడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.