- ఇద్దరూ అన్నదమ్ములే
- తల్లిదండ్రులతో కలిసి సరదాగా పొలానికి వెళ్లగా ఘటన
- భద్రాద్రి జిల్లా జమేందర్ బంజర్ లో విషాదం
దమ్మపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేందర్ బంజర్ గ్రామ శివారులో పిడుగు పడడంతో పాటు15 ఏండ్లలోపు వయస్సున్న అన్నదమ్ములు చనిపోయారు. జమేందర్ బంజర్ గ్రామానికి చెందిన బొర్రా సిద్దు(15), బొర్రా చందు (11) అన్నదమ్ములు. గురువారం తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడిపేందుకు పొలానికి వెళ్లారు.
అక్కడ ఓ చెట్టు కింద ఆడుకుంటుండగా ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. అప్పుడే చెట్టుపై పిడుగు పడడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. సిద్దు పర్కాల్ గండి స్కూల్ లో ఏడో తరగతి చదువుతుండగా, చందు జమిందార్ బంజర్గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు