చిల్వేరు గ్రామంలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

చిల్వేరు గ్రామంలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

మిడ్జిల్, వెలుగు: మండలంలోని చిల్వేరు గ్రామంలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. ఎస్సై శివనాగేశ్వర్  నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న చిల్వేరు గ్రామానికి చెందిన మల్లేపల్లి అలివేలు(40) భర్త హుస్సేన్ తో గొడవపడి తన ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువుల ఇండ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త హుస్సేన్  సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తండ్రీకొడుకుల మిస్సింగ్

మిడ్జిల్  మండలం బోయిన్​పల్లి గ్రామానికి చెందిన ఒర్సు శ్రీను(39) ఇంట్లో గొడవ పడి కొడుకు శశాంక్(6)ను స్కూల్  నుంచి తీసుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. బంధువుల ఇండ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య జంగమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు 
ఎస్సై తెలిపారు.