అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం.. హైదరాబాద్కు తీసుకొస్తున్న పోలీసులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభించింది. తల్లిదండ్రులు మందలించారని  మంగళవారం (సెప్టెంబర్ 26వ తేదీ) ఉదయం ఇంట్లో నుండి డబ్బులు తీసుకొని బయటకు వెళ్లారు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు.

ALSO  READ :-  అక్టోబర్1న పాలమూరు, 3న ఇందూరులో సభలు : కిషన్ రెడ్డి

బాలికలు ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లోని విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరూ కలిసే వెళ్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు బాలికలు హనుమకొండలో ఉన్నట్లు గుర్తించారు. వారిని హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.